రోజుకు 50 ప్రమాదాలు.. 23 మరణాలు
AP: రాష్ట్రంలో రోజుకు సగటున 50 ప్రమాదాలు జరుగుతున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) తెలిపింది. అందులో 23 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 53 మంది క్షతగాత్రులు అవుతున్నారు. అతివేగంతో వెళ్లడంతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలను క్లిష్టమైన జిల్లాలుగా మోర్త్ గుర్తించింది.