గట్టుమల్లలో ఓటు వేసిన గుత్తికోయలు

గట్టుమల్లలో ఓటు వేసిన గుత్తికోయలు

BDK: తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామపంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. క్రాంతి నగర్ హాబిటేషన్‌లో నివసిస్తున్న గుత్తికోయ గిరిజనులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల రోజున ఉదయం నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు క్రమబద్ధంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.