ఘనంగా ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు

SKLM: జిల్లాలోని సంతబొమ్మాలి నౌపడ గ్రామాల్లో శనివారం టీడీపీ ప్రముఖ నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 12వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ కార్యకర్తలు, మండల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సంత బొమ్మాళి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.