ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన డీసీఎం

ఆగి ఉన్న బస్సును  ఢీ కొట్టిన డీసీఎం

SRPT: ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును డీసీఎం ఢీ కొట్టిన ఘటన మునగాల శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం ధ్వంసం కాగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రైవేట్ బస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా హైవేపై పార్కింగ్ చెయ్యడంతో డీసీఎం యజమాని పిర్యాదు మేరకు బస్ డ్రైవర్ మల్లేశ్వరపుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.