RTC డ్రైవర్‌పై దాడి.. ఖండించిన మంత్రి
TG: సిరిసిల్లా జిల్లాలో RTC డ్రైవర్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. 'విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న RTC ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా SPకి ఆదేశించాం. RTC సోదరులపై దాడులను ఉపేక్షించం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం' అని పేర్కొన్నారు.