ఎడారిని తలపిస్తున్న తంతోలి వాగు

ఎడారిని తలపిస్తున్న తంతోలి వాగు

ADB: రూరల్ మండలంలోని తంతోలి వాగు పూర్తిగా ఎండిపోయింది. ఎన్నడూ లేని విధంగా ఎడారిని తలపించే రీతిలో కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి వాగు ఎప్పుడూ ఎండిపోలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో పంటలకు నీరందడం లేదని, పశువులు నీరు లేక వేసవిలో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.