రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
GNTR: తెనాలి–విజయవాడ రైలు మార్గంలోని చిలువూరు స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.