మాజీ మంత్రి సూర్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటు
VSP: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం అరసవిల్లిలోని ఆయన స్వగృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సూర్యనారాయణ పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఆమె పేర్కొన్నారు.