ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన పీఠాధిపతి

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఆగస్టు 8 నుంచి 14 వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ పరిశీలించారు. శ్రీ మఠం ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న క్యూలైన్ ఏర్పాట్లను ఇంజినీర్ సురేశ్ కోనాపూర్, మీడియా ప్రతినిధితో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.