పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్: జీవీ
PLD: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం వినుకొండలోని తన కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు రూ.38.94 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి వైద్యం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సాయం అందేలా చూసిన జీవీకి, సీఎం చంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.