'త్రిబుల్ ఐటీలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలి'

'త్రిబుల్ ఐటీలో  రెగ్యులర్ వైస్ ఛాన్సలర్  నియమించాలి'

ADB: బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని కోరారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ తక్షణమే విడుదల చేయాలన్నారు.