ఎస్పీకు పుష్పగుచ్చాన్ని అందజేసిన డీఎస్పీ
కృష్ణా: గుడివాడ డీఎస్పీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన పాల శ్రీనివాసరావు మచిలీపట్నంలోని ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. తమ బాధ్యతలను నిబద్ధతతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.