ఉదయించే జిల్లాగా తీర్చిదిద్దాలి: కేంద్ర మంత్రి

SKLM: వెనకబడిన ముద్రను చెరిపి ఉదయించే జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు సభలో పాల్గొని మాట్లాడారు. జిల్లాకు 75 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ నేల కోసం అనేక పోరాటాలు జరిగాయన్నారు.