టీచర్ లీవ్ అంటే స్కూల్‌కే లీవ్‌

టీచర్ లీవ్ అంటే స్కూల్‌కే లీవ్‌

ASF: తిర్యాణి మండలంలోని అలీగూడ ప్రాథమిక పాఠశాల శనివారం మూతపడింది. విధులకు హాజరుకావాల్సిన ఉపాధ్యాయుడు సెలవులో ఉండటంతో పాఠశాల నిర్వహణ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బడికి రాకుండా తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ విషయంపై ఎంఈవోను సంప్రదించగా, సిబ్బంది కొరత కారణంగా వేరే ఉపాధ్యాయుడిని పంపలేమని తెలిపారు.