'గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి'
SKLM: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని గ్రంథాలయ అధికారి జే నాగేశ్వరరావు కోరారు. గురువారం సారవకోట శాఖ గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటామని, స్థానికులతో పాటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.