అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామ సమీపంలో ఉన్న సాదు మెట్ట వద్ద గ్రామానికి చెందిన పూనే సీతమ్మ (65) మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించి, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.