'జెండా ఆవిష్కరణను అడ్డుకోవడం బాధాకరం'
KRNL: నందవరంలో బీజేపీ జెండా ఆవిష్కరణను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమని మంగళవారం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు జోక్యం చేసుకుని, సగం వరకు నిర్మించిన జెండా కట్టను పూర్తి చేయనివ్వలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బీజేపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.