VIDEO: ఎక్సైజ్ కార్యాలయంలో వేలంపాట
WNP: వనపర్తి ఎక్సైజ్ కార్యాలయంలో వివిధ నేరాల కింద సీజ్ చేసిన 6 వాహనాలకు వేలం వేయగా 3 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయని వీటి వేలం ద్వారా రూ.76,320 ఆదాయం, 4 సెల్ ఫోన్ల వేలంలో రూ.4వేలు సమకూరిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించారు. నిర్ణయించిన ధర కంటే కొంత ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు.