చింత చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం

చింత చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం

తిరుపతి: నాగలాపురం గాలివాన ప్రభావంతో బయట కొడియంబేడు వద్ద పుత్తూరు-చెన్నై హైవేపై భారీ చింత చెట్టు విరిగి పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్ఐ సునీల్, తహశీల్దారు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.