ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
కృష్ణా: మొవ్వ మండలం నిడిమోలులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు వివరాల మేరకు.. మచిలీపట్నం వైపు వెళ్తున్న ఓ కారు, రోడ్డు దాటుతున్న మద్దుల రోజా(30)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.