VIDEO: వరుణాదేవా.. కరుణ చూపవా..!

NLG: జిల్లాలో వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కోసం రైతులు, మహిళలు వేడుకుంటున్నారు. వరుణ దేవుడు కరుణించక పోవడంతో పాటిమట్ల పొట్టి గుట్ట మీద బసవ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహిళలు నీళ్ల బిందెలు మధ్యలో ఉంచి చుట్టూ కాముడు, బతుకమ్మ ఆడారు. 'వాన దేవుడా వానలు కురిపించూ' అంటూ వేడుకుంటూ పాటలు పాడారు.