క్రికెట్ బెట్టింగులు వేస్తే కఠిన చర్యలు
VZM: క్రికెట్ బెట్టింగులు వేస్తే కేసులు నమోదు చేస్తామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలసలో సోమవారం పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సమావేశం నిర్వహించి క్రికెట్ బెట్టింగులు, మాదకద్రవ్యాలు వలన కలిగే అనర్థాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.