టిప్పర్ ఢీకొని జీవాలు మృతి.. రోధిస్తున్న బాధితురాలు
MHBD: నెల్లికుదురు మండలంలోని సంధ్య తండాకు చెందిన భానోత్ సత్రాలి మేకలను రోడ్డు దాటిస్తున్న క్రమంలో టిప్పర్ అతివేగంగా వచ్చి సూడి మేకను ఢీకొట్టింది. దీంతో మేక పొట్ట పగిలి మూడు పిల్లలు రోడ్డుపై పడి చనిపోయాయి. నాలుగు ప్రాణాలను బలిగొన్న టిప్పర్ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది.