జిల్లాలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

జిల్లాలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

NGKL: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. కొల్లాపూర్ మండలంలో గడిచిన 24 గంటల్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 19 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.