VIDEO: వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు ఎమ్మెల్యే స్వయంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.