మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం: మంత్రి

మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం: మంత్రి

సత్యసాయి: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. గురువారం పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ.. రేపు శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 350 బస్సులు సిద్ధం చేశామన్నారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.