నగరంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం

నగరంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం

NTR: విజయవాడ ఆటోనర్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ నాలుగో రోడ్డులోని ఓల్డ్ టైర్ మార్కెట్లో పలు షాపులు అగ్నికి ఆహూతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.