VIDEO: పరకాలలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ
HNK: పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సోమవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నూతన మున్సిపల్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ ఛైర్మన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.