ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
NLG: శాలిగౌరారం మండలంలో వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించిన మొదటి విడత శిక్షణ ఆదివారంతో ముగిసింది. గ్రామ అభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై ఈ నెల 3 నుంచి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు మండల పరిషత్ అధికారులు సర్టిఫికెట్లను అందజేశారు.