ఘనపూర్ నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ

WNP: గతంలో నడుస్తున్న ఘనపూర్ నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును మళ్లీ పునరుద్ధరించాలని సింగిల్ విండో వైస్ ఛైర్మన్ క్యామ రాజు కాంగ్రెస్ నేతలతో కలిసి ఈనెల 14న ఆర్టీసీ వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు MLA మెఘారెడ్డి ఆదేశాలతో స్పందించిన డిపో మేనేజర్ ఆదివారం ఘనపూర్ నైట్ హాల్ట్ బస్సును పునరుద్ధరించారు.