మత్తు పదార్థాల నియంత్రణకు కలిసి పనిచేయాలి: ఎస్పీ
JGL: మత్తు పదార్థాల నియంత్రణకు అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శనివారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ మేరకు వ్యసనగ్రస్తుల పునరావాసంపై పలు సూచనలు చేశారు.