ఎర్రచందనం స్వాధీనం.. నలుగురు అరెస్ట్
TPT: శ్రీకాళహస్తి మండలం ఆదవరం బీటు, తీర్థాలపాల కోనల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన నలుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదవరం వద్ద 15 దుంగలు, తీర్థాలపాల కోనలో 9 దుంగలు లభించాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.