SLBCలో కొనసాగుతున్న బండరాళ్ల తొలగింపు

NGKL: శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగమార్గంలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. D1 ప్రదేశాన్ని డేంజర్ జోన్‌గా గుర్తించిన అధికారులు అక్కడ సహాయక చర్యలను ఎంతో జాగ్రత్తగా చేపడుతున్నారు. ఆదివారం బండరాళ్ల తొలగింపుతో పాటు నీటిని పంపింగ్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి వదులుతున్నారు. సింగరేణి, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.