'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KMM: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నెలకొండపల్లి మండల కేంద్రంలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు రాజేష్ అన్నారు. వర్షాకాలంలో దోమలు పెరుగుదల వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు నివాస పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.