నిజామాబాద్ పార్లమెంట్ ఓటింగ్ సరళి ఇలా

NZB: మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5.00 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.