బాధిత కుటుంబానికి సాయం అందజేత
E.G: కోరుకొండలో పాముకాటుతో మృతి చెందిన సుంకర వీరబాబు కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి విషయం తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా కృషి చేశారు. ఆదివారం ఆ మొత్తాన్ని కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.