నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMM: ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ముందుగా మంత్రి తుమ్మల 49వ డివిజన్ రామాలయ సెంటర్, 7వ డివిజన్ టేకులపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం రఘునాథపాలెం మండలం V.V పాలెం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.