భక్తులకు పండ్లు పంపిణీ చేసిన ముస్లింలు
KMR: బీర్కూర్ గ్రామంలో నేడు నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో ముస్లింలు తమ ఉదారతను చాటుకున్నారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు వారు అరటిపండ్లు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటారు. సామాజిక సౌహార్దానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు సాదరంగా అభినందించారు. అలాగే, పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.