పీడీఎస్ బియ్యం పట్టివేత

VZM: నెల్లిమర్ల మండలంలోని బుచ్చన్నపేట జంక్షన్లో ఉన్న కుర్మాన కమల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల(19 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు ఆ విభాగం ఎస్సై రామారావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. పట్టుబడిన బియ్యాన్ని బొప్పడాం రేషన్ డీలర్‌కు అప్పగించారు.