జూనియర్ సివిల్ జడ్జిలుగా మహిళలు ఎంపిక
VSP: గాజువాకకు చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన ఎంపిక వివరాల్లో వీరి పేర్లు ఉండడంతో గాజువాక బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కొట్టాన బిందు రెండో ప్రయత్నంలోనే విజయం సాధించగా, ధర్మాల లలితశ్రీ వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించి జడ్జిగా ఎంపికయ్యారు.