ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం సోదరీమణులకు సరఫరా చేస్తున్న రంజాన్ తోఫా(కానుక)లను శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముఖాడే ఉత్తం అందజేశారు. అనంతరం వారికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్ నాయక్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, ఎండి మసూద్ ఉన్నారు.