కారులో భారీగా నగదు లభ్యం
HYD: సికింద్రాబాద్ పరిధిలో బోయిన్‌పల్లిలో క్రైమ్ పోలీసులు రూ. 4 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో ఈ అక్రమ నగదును తరలిస్తుండగా, పోలీసులు తనిఖీ చేసి హవాలా ముఠాను పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో ఉన్న నగదును నిందితులు కారు టైరు, సీట్ల కింద దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.