VIDEO: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరి మృతి

ASR: డుంబ్రిగుడ మండలంలోని శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాలివలసకి చెందిన లవకుశ, యుగేంద్రనాయుడు బైక్‌పై అరుకు శుక్రవారం వారపు సంతకు వస్తున్నారు. ఈ క్రమంలో మాలివలసకు చెందిన ముకుంద్ అరుకు నుంచి మాలివలసకి వెళ్తుండగా కొరం జిగూడ ఘాట్రోడ్డు మలుపు వద్ద 2 బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యుగేంద్రనాయుడు, ముకుంద్ మృతి చెందారు.