అర్థరాత్రి ర్యాపిడో బుక్ చేసుకున్నా, కానీ..!
అర్ధరాత్రి తనని ర్యాపిడో కెప్టెన్ సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని బెంగళూరుకి చెందిన ఓ యువతి పోస్ట్ పెట్టింది. 'అర్ధరాత్రి 11:45 గంటలకు ర్యాపిడో బుక్ చేసుకున్నా. దాదాపు 38km వెళ్లాలి. నా ఫోన్ బ్యాటరీ 6% ఉంది. కొంతదూరం వెళ్లాక బైక్ చైన్ తెగిపోయింది. మెకానిక్ షాప్‌లు క్లోజ్ చేసి ఉండటంతో అతనే రిపేర్ చేసి ఒంటిగంటకు ఇంటి దగ్గర దిగబెట్టాడు' అని పేర్కొంది.