డెంగ్యూ కేసును పరిశీలించిన డిఐఓ

MBNR: హన్వాడ మండలం దాచక్పల్లిలో డెంగ్యూ పాజిటివ్ కేస్ నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆ గ్రామంలో జిల్లా DIO డా. పద్మజ సందర్శించారు, వ్యాధి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలోని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి ప్రగతి ఉన్నారు.