పందిళ్లపల్లిలో డ్రైవర్‌లకు అవగాహన కార్యక్రమం
KMM: చింతకాని (M) పందిళ్లపల్లిలో ఇవాళ 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా డ్రైవర్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని అఖిల కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సారంగపాణి పాల్గొని మాట్లాడారు. డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాలు నివారించవచ్చని ఆయన తెలిపారు.