'ప్రజలకు నీటి ఎద్దడి సమస్య ఉండోద్దు'
MLG: వేసవి కాలంలో గ్రామాలలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇవాళ మంగపేట ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎంపీడీవో బద్రు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.