'తడిచెత్త-పొడిచెత్త వేరుచేసి ఇవ్వాలి'

AKP: గ్రామస్తులు తడిచెత్త పొడిచెత్త వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని నక్కపల్లి ఎంపీడీవో సీతారామరాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గొడిచర్లలో తడిచెత్త పొడిచెత్త ఏ విధంగా వేరు చేయాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు.