VIDEO: ఐదవ శక్తిపీఠంలో భక్తుల రద్దీ
GDWL: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది ప్రథమ చికిత్స కేంద్రాలు అలాగే, ఒక అంబులెన్స్‌ను కూడా దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.