ఓపెనర్‌గా రోహిత్ ఖాతాలో మరో రికార్డ్

ఓపెనర్‌గా రోహిత్ ఖాతాలో మరో రికార్డ్

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక సార్లు 50+ స్కోర్స్ సాధించిన మూడో ఆటగాడిగా క్రిస్ గేల్(78) రికార్డ్‌ను రోహిత్(79*) బ్రేక్ చేశాడు. అ లిస్ట్ తొలి స్థానంలో సచిన్(120) ఉండగా.. రెండో స్థానంలో సనత్ జయసూర్య(94) కొనసాగుతున్నాడు. రోహిత్ వరల్డ్ కప్ వరకు కొనసాగితే జయసూర్యను అధిగమించే ఛాన్స్ ఉంది.